జెటిసి చంద్రశేఖర్ గౌడ్‌కు ఆహ్వానం

రుద్రూర్ : మండల కేంద్రంలో  నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ వేడుకలకు రావాల్సిందిగా జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌ను ఆలయ కమిటీ ప్రతినిధులు శుక్రవారం ఆహ్వానించారు.
ఈ మేరకు హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ ప్రారంభ ఉత్సవ కార్యక్రమాలకు తప్పకుండా హాజరై, అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ గుడి కమిటీ ప్రతినిధులు దార్సీ సాయిలు, మొద్దుల నర్సయ్య, ఏముల గజేందర్, బైండ్ల అనిల్‌, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.