ఉచిత వైద్య, రక్త దాన శిభిరం

రుద్రూర్: ధాత్రి శ్రీ ఫౌండేషన్ , రుద్రూర్ లయన్స్ క్లబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గురువారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో దాతల ద్వారా రక్తాన్ని స్వీకరించారు.
రానంపల్లి గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హార్ట్ స్పెషలిస్ట్ జనరల్ వైద్యులు ,కంటి ,దంత వైద్యులు హాజరై వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి డాక్టర్ సుభాష్, లలిత హాస్పిటల్ డాక్టర్ తరుణ్ రెడ్డి, లయన్స్ కంటి ఆసుపత్రి డాక్టర్ సతీష్, లైఫ్ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఇర్ఫాన్ అలీ, మెడికవర్ హాస్పిటల్ ఇంచార్జ్ రవి యాదవ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కెవి మోహన్, జిల్లా చైర్మన్ శ్యాంసుందర్ పహడే, సభ్యులు పుట్టి సాగర్, శామీర్, దాత్రి శ్రీ ఫౌండేషన్ అధ్యక్షులు గాండ్ల మధు, ఎం. రమేష్ తదితరులు పాల్గొన్నారు.