పనుల జాతర ప్రారంభం

రుద్రూర్ (స్థానికం న్యూస్ ): మండల కేంద్రంలో పనుల జాతరలో భాగంగా శుక్రవారం మండల అధికారులు, నాయకులు అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ  నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో భీమ్రావు మాట్లాడుతూ..  పనుల జాతర కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి భవనాలతో పాటు మండలంలో  19 గేదెల షెడ్లు, ఐదు గొర్రెల షెడ్లు,  5 పౌల్ట్రీ ఫామ్ లతో  పాటు ఇంకుడు గుంతలు  మంజూరైనట్టు తెలిపారు. కార్యక్రమంలో  పి ఆర్ ఏ ఈ పవన్, ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీలత, ఏపీఓ రాజేశ్వర్, కార్యదర్శి ప్రేమ దాస్,  మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, విండో మాజీ చైర్మన్ పత్తిరాము, విండో డైరెక్టర్లు అశోక్ , సుభాని, రాయకూర్ విండో వైస్ చైర్మన్ తోట అరుణ్ కుమార్, నాయకులు పార్వతి ప్రవీణ్, పత్తి లక్ష్మణ్,  ఇందూర్ కార్తీక్,  తోట సంగయ్యతదితరులు ఉన్నారు.