
రుద్రూర్: అంబం (ఆర్) సర్పంచ్ గా గెలుపొందిన కుర్లెపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి సాయి ప్రసాద్, వార్డు సభ్యులను శనివారం బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి, బాన్సువాడ సెగ్మెంట్ నేత, ఎన్ఆర్ఎ కోనేరు శశాంక్, మండల బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు. ప్రజల సమస్యలను పరిష్కారిస్తూ వారి మనసులో స్థానం సంపాదించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని వారు అభినందించారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు అలపాటి హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకుడు ప్రకాష్ పటేల్, వార్డు సభ్యులు జ్యోత్స్న పవన్, నాగమణి గణేష్, ఆర్.సాయిలు, బి. రాము తదితరులు పాల్గొన్నారు.


