రుద్రూర్ : రుద్రూర్ జీపీ నూతన సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్‌ను సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బీన్ హందన్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాభివృద్ధి దిశగా నిరంతరం కృషి చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, బచ్చు రాము, ఉప సర్పంచ్ నిస్సార్, ఇందూర్ కార్తీక్, వడ్ల నరేష్, శ్రీకాంత్ గౌడ్, కార్కే సాయి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

