నేడు  స్వామి పరమార్థ దేవ్ జీ రాక

రుద్రూర్ : మండల కేంద్రానికి ఈనెల 29వ తేదీ బుధవారం ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ముఖ్య శిష్యుడు డాక్టర్ స్వామి పరమార్థ దేవ్ జీ   వస్తున్నట్లు తెలంగాణ సోషల్ మీడియా ప్రభారి డాక్టర్ మహాజన్ విశ్వనాథ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండల ప్రజలతో పాటు సమీప గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. జీవితంలో లక్ష్యాలను సాధించాలంటే ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నానుడి ప్రాముఖ్యతను గుర్తుచేశారు.

కార్యక్రమంలో డా. స్వామి పరమార్థ దేవ్ జీ యోగ, ధ్యానం, ప్రాణాయామం, ఆయుర్వేదం, నేచురోపతి వంటి అంశాలపై విలువైన సూచనలు అందించనున్నారు. ప్రతిరోజు యోగా సాధన ద్వారా శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించనున్నారు. అలాగే యజ్ఞం ద్వారా పంచమహాభూతాల సంరక్షణ సాధ్యమవుతుందని కూడా తెలియజేయనున్నారు. కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహర్షి పతంజలి యోగ మరియు ధ్యాన కేంద్రం, రుద్రూర్ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.