
రుద్రూర్: మండలం లోని చిక్కడపల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సోమవారం యువకులు సర్పంచ్ గ్రామ రమేష్తో కలిసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ… స్వామి వివేకానంద యువతకు మార్గదర్శకుడని, ఆయన బోధనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని వివేకానంద సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక యువకులు అశోక్, శ్రవణ్, శంకర్, మచ్కూరి మహేష్, సాయిలు, పిట్ల మహేష్, శేఖర్, పిట్ల శేఖర్, రవి, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
