ఘనంగా శ్రీ బసవేశ్వరయంతి


రుద్రూర్ :’ మండలం లోని కొండాపూర్ శివారు గైనిగుట్టలోని స్వయంభు బసవేశ్వర ఆలయంలో ఆదివారం బసవేశ్వర జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి నుంచే ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, స్వయంభు బసవేశ్వర స్వామి జయంతి సందర్భంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ని తహసిల్దార్ సాయిలు, కొండాపూర్ సర్పంచ్ గొంటి సాయిలు, వర్ని ఏఎంసీ మాజీ చైర్మన్ నారాయణరావు పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవాలకు సమీప గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతంగా నిర్వహించారు.