

రుద్రూర్: మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి సామూహిక గోవిందా నామస్మరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఇకపై ప్రతి శనివారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గోవిందా నామస్మరణ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీహరి కృపను పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కర్క అశోక్, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, చిదుర మహిపాల్, దుర్కి రవి, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
