కొనసాగుతున్న శిక్షణ తరగతులు

– బెస్ట్ ప్రజెంటేషన్ కు  బహుమతుల అందజేత

రుద్రూర్ :  మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన వార్డు సభ్యుల శిక్షణా తరగతులు బుధవారం కొనసాగాయి. తొలి రోజు నేర్చుకున్న అంశాలపై వార్డు సభ్యులకు ఎంతవరకు అవగాహన వచ్చిందో ట్రైవర్లు ప్రశ్నల ద్వారా తెలుసుకున్నారు. బెస్ట్ ప్రజెంటేషన్ చేసిన ముగ్గురు వార్డు సభ్యులకు ఎంపీడీవో బాలగంగాధర్ బహుమతులు అందచేశారు. అనంతరం ట్రైనర్లు నాయకత్వ లక్షణాలు గూర్చి వివరిస్తూ ప్రజా సేవలో నిజాయితీగా ఉండాలని సూచించారు. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ వంటి జీపీకి గల ఆదాయ వనరులు, సాధారణ గ్రాంట్లు, ప్రత్యేక గ్రాంట్లు ప్రత్యేక పన్నులు తదితర అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు. శిక్షణ ద్వారా గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర మరింత ప్రభావవంతంగా ఉండాలని ట్రైనర్లు సూచించారు. ఎంపీడీవో బాలగంగాధర్ , ఎంపీఓ అరవింద్,  ట్రైవర్లు క్యాకప్ప, ఈశ్వర్, రామకృష్ణ, శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.