– సుదర్శన్ సేవలు మరువలేనివి

రుద్రూర్ : సంఘ అభివృద్ధి , రైతుల సంక్షేమానికి ఈగ సుదర్శన్ అందించిన సేవలు మరువలేనివని విండో సభ్యులు, సిబ్బంది పేర్కొన్నారు. సంఘ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఈగ సుదర్శన్ శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్, విండో సభ్యులు , సిబ్బంది ఈగ సుదర్శన్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. దీర్ఘకాలం పాటు నిజాయితీగా విధులు నిర్వర్తించిన వ్యక్తి ఈగ సుదర్శన్ అని పేర్కొన్నారు. ఆయన పదవీ విరమణ పొందడం చాలా బాధాకరమని అన్నారు. అదేవిధంగా సహకార సంఘంలో మళ్లీ తాత్కాలిక పద్ధతిలో ఆయనను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అనంతరం ఈగ సుదర్శన్ మాట్లాడుతూ.. సహకార సంఘంలో 36 సంవత్సరాలుగా పనిచేసిన ఎలాంటి గుర్తింపు లేదని, బెనిఫిట్స్ కూడా రాలేదని, విండో సభ్యులు, గ్రామ పెద్దలు సహాయ సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గుర్ల గోపి, ఏముల గజేందర్, తోట శంకర్ పటేల్, అడప శంకర్, బొట్టే గజేందర్, సురేష్, సాగర సంఘ సిబ్బంది, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
