
పోతంగల్: పాత్రికేయులు సమాచారాన్ని సేకరించి, దానిని విశ్లేషించి వాస్తవాలను ప్రజలకు అందించడం ఎంతో ముఖ్యమని ఎస్ఐ సునీల్ అన్నారు. మంగళవారం పోతంగల్ ప్రెస్ క్లబ్ ను తహసిల్దార్ విష్ణుతో కలిసి ప్రారంభించారు. ఎస్ ఐ మాట్లాడుతూ …సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు సరిగ్గా తెలియజేయడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నిజానిజాలను పరిశీలించి, బాధ్యతతో వార్తలను అందించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించవచ్చని అన్నారు.
పాత్రికేయ వృత్తిలో నిబద్ధత, నిజాయితీ అత్యంత అవసరమని, సమాజ ప్రయోజనాల దృష్ట్యా పని చేయాలని సూచించారు. వాస్తవాలను ప్రజలకు చేరవేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుందని చెప్పారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంగాధర్ దేశాయ్ ,మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్ , రిటైర్డ్ హెడ్మాస్టర్ నాగయ్య , నాయకులు పబ్బ శేఖర్ , హకీమ్ , పాత్రికేయులు, నాయకులు పాల్గొన్నారు.

