ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

రుద్రూర్: మండలంలోని అంబం (ఆర్) ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపాల్ కులకర్ణి రాఘవేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. MPC, BiPC, CEC, ACE గ్రూపుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి మెరిట్ ఆధారంగా మాత్రమే అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. బాలికలకు వసతి సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు.
ఈ విద్యా సంవత్సరంలో మోడల్ పాఠశాలలో కొత్తగా ACE గ్రూప్ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు టీజీఎంఎస్ అధికారిక వెబ్‌సైట్⁠� ను సందర్శించాలని, అలాగే 9347557517 నంబర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.