రుద్రూర్: మండలంలోని అంబం ( ఆర్) శివారు లో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపాల్ రాఘవేందర్ కులకర్ణి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు 13 మే నుంచి 25 మే వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల కోసం tgms.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షల మెరిట్ మరియు రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఈ నెల 27న కళాశాల నోటీసు బోర్డుపై ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం 28 నుంచి 30 మే వరకు ధృవపత్రాల పరిశీలనతో పాటు ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, ఈఏపీసెట్/నీట్ కోచింగ్, ఫిజిక్స్ వల్లా, ఖాన్ అకాడమీ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్ కల్పించనున్నట్లు తెలిపారు. అదనంగా కెరీర్ కౌన్సెలింగ్, హెల్త్ కేర్, బ్యూటీ & వెల్నెస్ రంగాల్లో వృత్తి విద్యా కోర్సులు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, సహ పాఠ్య కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు.
బాలికల కోసం ప్రత్యేకంగా 100 సీట్లతో హాస్టల్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ ఉన్నత విద్య లక్ష్యాలను సాధించాలని ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది కోరారు.
మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్: 9347557517 ను సంప్రదించవచ్చని తెలిపారు.


