పది లో  ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం


రుద్రూర్ :  ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన  మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శనివారం గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ…పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి మండలానికి మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులను అభినందించి మెమొంటోలు అందజేశారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కట్టా శ్రీనివాస్ రావు, కాంప్లెక్స్ హెచ్‌ఎం రామ్‌సింగ్, హెచ్‌ఎం పద్మావతి, ఉప సర్పంచ్ షేక్ నిసార్, రైడ్స్ అధ్యక్షుడు కర్రోళ్ల కృష్ణప్రసాద్, కార్యదర్శి పార్వతి శేఖర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాఘవేందర్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శ్యామల, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.