సాధన చేస్తే విజయం సాధ్యం

రుద్రూర్: లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళిక బద్దంగా సాధన చేస్తే విజయాన్ని తప్పకుండా సాధిస్తారని ఎస్సై సాయన్న అన్నారు. రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో ప్రభుత్వం ఉద్యోగం సాధించిన 13 మందిని గురువారం* రాత్రి గ్రామాభివృద్ది కమిటి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన ఎస్సై మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపికైన వారిని అభినందించారు. ఉద్యోగ వేటలో నిరుద్యోగులకు సలహాలు, సూచనలు అందచేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నరోజి గంగారాం, గ్రామాభివృద్ది కమిటి అధ్యక్షుడు పట్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు బొప్పాపూర్ గ్రామంలో పోలీస్ కళాజాత ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు,  సైబర్ నేరాల పై అవగాహన కల్పించారు.

రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో గురువారం రాత్రి పోలీస్ కళా బృందం సభ్యులు ఇచ్చిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, హెల్మెట్ వల్ల ఉపయోగాలు తదితర అంశాల గూర్చి బృందం సభ్యులు చక్కగా వివరించారు. |