టీచర్ల సేవలు అభినందనీయం

రుద్రూర్: అంగన్ కేంద్రాల్లో టీచర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ దాదాన్న గారి విఠల్ అన్నారు. ఉపాద్యాయుల దినోత్సవాన్ని పురస్కారించుకుని ఆదివారం జీఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో వివిధ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్న టీచర్లను సన్మానించారు. వీరిలో రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన బండారి గంగామణి, డి. పద్మ ఉన్నారు. వీరు గత కొన్నెళ్లుగా అంగన్ వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా జి ఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించి ప్రశంస పత్రం, మోమెంటోను అందచేశారు.  సన్మానం పొందిన అంగన్ వాడీ టీచర్లను మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలత, సహచర టీచర్లు అభినందించారు.