ఉత్సాహంగా బతుకమ్మ పండుగ

కోటగిరి : మండల కేంద్రంలో  గురువారం బతుకమ్మ పండుగ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా తీసుకెళ్తూ సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూల బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ సందడి చేశారు. అనంతరం గ్రామాల్లోని స్థానిక చెరువుల వద్దకు చేరుకుని బతుకమ్మలను నిమజ్జనం చేశారు. వేడుకల్లో స్థానిక సర్పంచ్  బర్ల మధుకర్ తో పాటు నాయకులు  పాల్గొన్నారు.