

వర్ని : మండలంలోని జాకోర గ్రామంలో సోమవారం బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి, ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం బతుకమ్మలను బామన్ కుంటలో నిమజ్జనం చేశారు.
