విప్లవ కెరటం చిట్యాల ఐలమ్మ

రుద్రూర్: భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన విప్లవ కెరటం చిట్యాల ఐలమ్మ అని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ అన్నారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలో ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నన్నేసాబ్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను మతోన్మాదులు హిందూ–ముస్లిం ఘర్షణగా చిత్రీకరిస్తూ వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం చరిత్రను వక్రీకరించడం సరికాదన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో పేద ప్రజలు ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీపీఎం నాయకులు లక్ష్మణ్, భీమయ్య, మహబూబ్, సాయిలు, భూమయ్య, పీరయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

రజక సంఘం ఆధ్వర్యంలో..

రుద్రూర్: మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
రజక సంఘం అధ్యక్షుడు బందేల శేఖర్ మాట్లాడుతూ.. భూస్వామ్య, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆమె ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ విగ్రహాని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు నర్సింలు గ్రామ అధ్యక్షుడు జనగరి రాజు, ఈరపురo సాయిలు, ఎల్లగారి నరేందర్, అంబం సాయిలు, బాబి సాయిలు, బీమయ్, శంకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రతినిధుల ఘన నివాళి

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41 వర్ధంతి ని రుద్రూర్ మండల కేంద్రం రజక సంఘం లో గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్ర శేఖర్ ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమం లో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు సభ్యులు విమల గౌడ్, దుర్కి రవి, రజక సంఘం సభ్యులు రాజు,జనగారి నర్సిములు, వీరాపురం సాయిలు, జయరాం,  నరేందర్ తదితరులు పాల్గొన్నారు.