
రుద్రూర్: మండల కేంద్రంలో ఎడ్ల పొలాల అమావాస్య పర్వదినాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాలలోని గోమాతలను రంగురంగుల వస్త్రాలు, పూలతో అందంగా అలంకరించారు. అనంతరం గోమాతలతో ప్రధాన వీధుల ద్వారా ర్యాలీ నిర్వహించారు.
సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ గోమాతలకు పూజలు నిర్వహించి, పండుగ వేడుకలను జరుపుకున్నారు. శ్రీ హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయించారు. ఈ సందర్భంగా గోసేవ ప్రాధాన్యతను పలువురు వివరించారు. వేడుకల్లో మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ కర్క అశోక్, ప్రముఖ వ్యాపారవేత్త బచ్చు రామ్ సెట్, ఆదర్శ రైతు అడ్ప సాయిలు , గంగాధర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
