స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక చేయూత

రుద్రూర్: వివిధ కారణాలతో మృతి చెందిన స్నేహితుల కుటుంబానికి వారితో పాటు విద్యాబుద్ధులు నేర్చుకున్న స్నేహితులు ఆదివారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామానికి చెందిన నక్క హనుమంతు, మచ్కూరి శంకర్ రుద్రూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2002-03 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు తమ స్నేహితులు మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటామని భరోసా, మనోధైర్యాన్ని ఇచ్చారు. నయీమ్, రాము , కాంతారావు , పవన్, గణేష్ ,అశోక్ ,రమేష్ , గోరేబాబు ,సంతోష్ , విజయ్ ,నగేష్ , పోశెట్టి ,రవి ,శ్రీనివాస్ , పురుషోత్తం ఉన్నారు.