
రుద్రూర్ : మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో సోమవారం బచ్చు రామ్ సెట్, బజరంగ్దళ్ సహకారంతో చిక్కడపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామస్థులకు ఉచితంగా ఆవుపాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మచ్కూరి రమేష్ మాట్లాడుతూ … ఉచితంగా ఆవుపాల పంపిణీ కార్యక్రమానికి సహకరించిన దాతలకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పిట్ల కళ్యాణ్, వార్డు సభ్యులు జెల్లా సాయిలు, బేకరీ గోపి, సావిత్రి, గ్రామ పెద్దలు డాక్టర్ మల్లేష్, గోపాల్, నక్క గంగాధర్, అశోక్, శ్రావణ్, తగిలి అశోక్, హనుమయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
