ఘనంగా రాము జన్మదిన వేడుకలు

బోధన్: రుద్రూర్ సింగిల్‌ విండో మాజీ చైర్మన్, లయన్ పత్తి రాము జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బోధన్ లయన్స్‌ కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న రోగులు, వారి సహాయకులకు రుచికరమైన భోజనం అందించారు.
ఈ సందర్భంగా పత్తి రాము మాట్లాడుతూ… తన జన్మదినం సందర్భంగా క్లబ్‌ సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని, వారికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా చైర్మన్ లయన్ కె.వి. మోహన్ , జీఎస్టీ కో-ఆర్డినేటర్ లయన్ శ్యాంసుందర్ పహాడే, క్లబ్ కార్యదర్శి లయన్ గెంటిల గంగాధర్, సభ్యులు గాండ్ల మధు, ఏఎంసీ డైరెక్టర్ పార్వతి ప్రవీణ్,  బోధన్ క్లబ్ సభ్యుడు లయన్ కటకం రమేష్ తదితరులు పాల్గొన్నారు.