స్కూల్ బ్యాగ్ ల  అందజేత

వర్ని : మండలంలోని కూనీపూర్ గ్రామంలో శుక్రవారం మాదాల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో
ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదివే విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు. పంచాయతీ కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ డాక్టర్ రాజారెడ్డి, భారత్ గ్యాస్ నరసయ్య, సింగిల్ విండో మాజీ చైర్మన్ లు గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి , పంచాయతీ కార్యదర్శి సౌజన్య, కాంతయ్య,కృష్ణారెడ్డి, లచ్చరెడ్డి,గంగారాం, సాయిలు,దేవయ్య,లక్ష్మణ్ పాల్గొన్నారు.