పీఆర్టియు క్యాలెండర్ ఆవిష్కరణ

రుద్రూర్: మండల కేంద్రంలోని  ప్రభుత్వ సమీకృత భవన సముదాయ కార్యాలయం వద్ద మంగళవారం తహసిల్దార్ తారాబాయి, ఎంపీడివో సురేష్ బాబు, ఎంఈఓ శ్రీనివాస్ సమక్షంలో పీఆర్ టీయు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  పి ఆర్ టి యు అధ్యక్షులు వై. విట్టల్ ల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి. దస్తగిరి, రాష్ట్ర కార్యదర్శులు వి. రమేష్, ఇంతియాజ్, అహ్మద్, మండల బాధ్యులు వీరేశం, ఉపాధ్యాయులు గంగారాం, కోటేశ్వరరావు, మోడల్ స్కూల్ హెచ్ ఎం. చెన్నప్ప, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.