
రుద్రూర్ : మండల కేంద్రంలోని గ్రంథాలయ శాఖను ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి సందర్శించారు. గ్రంథాలయ భవనంలోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు, విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి గ్రంథాలయ భవనం పై అంతస్తులో ఉన్న గదిని రీడింగ్ రూంగా కేటాయించాలని సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చైర్మన్ అవసరమైన సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.
రీడింగ్ రూంను నిరుద్యోగులు, విద్యార్థులు సక్రమంగా వినియోగించుకుంటే అక్కడ సీసీ కెమెరాలతో పాటు వైఫై సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, మాజీ ఉపసర్పంచ్ డౌర్ సాయిలు, రైడ్స్అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ ప్రసాద్, శేఖర్, ఉపాధ్యక్షుడు బాల్ రాజ్, స్థానికులు మేక వెంకటేశ్వరరావు, గాండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

