

రుద్రూర్: మండల కేంద్రంలోని నాల్గవ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అమ్మ మాట- అంగన్వాడీ బాట కార్యక్రమంలో బాగంగా చిన్నారులకు కేంద్రంలో చేర్పించారు. వీరికి అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ టీచర్ సునంద మాట్లాడుతూ.. చిన్నారుల కోసం అంగన్ వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గూర్చి వివరించారు. చిన్నారులకు చదువుతో పాటు పౌష్టికాహరాన్ని కేంద్రాల్లో అందిస్తామని పేర్కోన్నారు.