
పోతంగల్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోతంగల్ గ్రామంలో శ్రీ స్వామి వివేకానంద యూత్, లయన్స్ క్లబ్ ఆఫ్ పోతంగల్ ఆధ్వర్యంలో సోమవారం ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సమీప గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి మట్టి విగ్రహాలను స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను వినియోగించాలని నిర్వాహకులు సూచించారు.
కార్యక్రమంలో స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు సూదం భూమయ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎస్. లక్ష్మణ్, బి. సరోజ శాంతేశ్వర్ పటేల్, లయన్ సితలే రమేష్, సర్పంచ్ కల్లూరి భజరంగ్, చిత్తరి అశోక్, బండారి హన్మండ్లు, కార్యదర్శి నాగయ్య, సితలే మోహన్, దశరథ్, గాండ్ల సాయిబాబా, వడ్ల దత్తు, సత్యనారాయణతో పాటు యూత్, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామ యువకులు, ప్రజలు పాల్గొన్నారు.


