ఘనంగా ఎమ్మెల్యే పోచారం వివాహ వార్షికోత్సవం

రుద్రూర్:  రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వివాహ వార్షికోత్సవాన్ని రుద్రూర్ మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పోచారం దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గజమాలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజాసేవలో విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలతో మమేకమై సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కట్టుబడి పనిచేస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ పత్తి రాము, మాజీ జెడ్పీటీసీ నరోజీ గంగారాం, సర్పంచ్ కొండల్‌వాడి శంకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, దిశా కమిటీ సభ్యుడు నడిపింటి నగేష్, మండల నాయకులు పత్తి లక్ష్మణ్,  ఖాదర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.