
మోస్రా: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పలు రకాల మొక్కలను నాటి వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బజరంగ్ దళ్ మోస్రా ప్రకాండ సంయోజక్ మాలోత్ తరుణ్ నాయక్ మాట్లాడుతూ… పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. స్థానికులు కూడా ఈ కార్యక్రమాన్ని అభినందించారు.
