పోతంగల్ తహసిల్దార్ గా సందీప్

పోతంగల్ :  మండల నూతన తహసిల్దారుగా సందీప్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన తహసిల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన సందీప్ మాట్లాడుతూ..,.ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శక పరిపాలన అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అర్జున్, ఉపాధ్యక్షుడు గంధపు దత్తు, యాదవరావు, లక్ష్మణ్, సురేష్, అజారుద్దీన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.