పోతంగల్ సర్పంచ్ కు  మాజీఎమ్మెల్యే ఎండల అభినందనలు


పొతంగల్ : పోతంగల్ గ్రామ సర్పంచ్ గా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన కల్లూర్ సంధ్య హన్మండ్లు ను బిజెపి మాజీ శాసన సభా పక్ష నాయకులు ఎండల లక్ష్మీనారాయణ అభినందించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా గ్రామపంచాయతీకి అభివృద్ధి నిధులు కేటాయించడం కోసం నరేంద్ర మోడీ అవినీతి రహితంగా గ్రామాల అభివృద్ధి కోసం బాటలు వేస్తున్నారని అన్నారు. పార్లమెంటు నుంచి పంచాయతీకి నేరుగా నిధులు తీసుకురావడంలో బిజెపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడం శుభపరిణామం అన్నారు. పోతంగల్ గ్రామ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంటుందని తెలిపారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బాన్సువాడ నియోజకవర్గం లో బిజెపికి ఓటు వేయడం ద్వారా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి ఆస్కారం ఉంటుందన్నారు . ప్రజలు అవినీతి రహిత పాలనను, పారదర్శకమైన అభివృద్ధిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల బరిలో నిలిచి ప్రత్యర్థుల కుట్రలను భగ్నం చేసి పోతంగల్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన సంధ్య హన్మండ్లు దంపతులు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని, రానున్న రోజుల్లో గ్రామాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందాలని వారు సూచించారు.