ఘనంగా గణేశుని శోభాయాత్ర

రుద్రూర్ : మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి గణేష్ మండలి ఏర్పాటై 18 ఏళ్లుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జన శోభయాత్ర ఆదివారం ఘనంగా నిర్వహించారు. పిల్లల ఆట,పాటలు , యువకుల నృత్యాల మధ్య శోభయాత్ర కొనసాగింది. స్థానిక పెద్ద చెరువులో అర్ధరాత్రి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా లడ్డు వేలంపాట నిర్వహించగా ఈర్వ లక్ష్మి రూ. 7,200లకు వేలకు వేలపాటలో దక్కించుకున్నారు. చివరి రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.