బోధన్ సభకు తరలి రావాలి

కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు,  వృద్ధులు,  బీడీ కార్మికులు,  గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు  పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి  సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.