లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం

రుద్రూర్: లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉర్దూ మీడియం హై స్కూల్ హెడ్మాస్టర్ రామసింగ్ అన్నారు. మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం హై స్కూల్ లో బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎనర్జీ డ్రింక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్య ,వైద్య సేవలు అందచేయడంలో ముందుందని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ జిల్లా చైర్మన్ శ్యామ్ సుందర్ పహాడే, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కెవి మోహన్, డైరెక్టర్లు వి.రామరాజు ,ఎం.రమేష్ ,పి .సందీప్, శామీర్, జలోజీ, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.