బీజేపీ నేతల విజయోత్సవాలు


రుద్రూర్: పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా సోమవారం రాత్రి రుద్రూర్‌లో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ నాయకుడు కోనేరు శశాంక్ మాట్లాడుతూ…పార్టీ విజయానికి కార్యకర్తల కృషి, ప్రజల మద్దతు కారణమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేయడంలో బీజేపీ ముందుంటుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు హరికృష్ణ,c
మండల కార్యదర్శి ఎముల గజేందర్, మండల నాయకులు పార్వతి మురళి, గంగాధర్, వెంకన్న, శివప్రసాద్ , ప్రశాంత్ గౌడ్, కృష్ణంరాజు ,అనిల్, సతీష్ గౌడ్, లాయర్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

యోగ మాస్టర్ సతీష్ గౌడ్ కు అభినందనలు

యోగాలో నంది అవార్డు సాధించిన యోగ మాస్టర్ సతీష్ గౌడ్ ను బిజెపి నాయకులు సోమవారం రాత్రి అభినందించారు. శాలువ తో సత్కరించి మిఠాయి తినిపించారు . యోగ మాస్టర్ గా సతీష్ గౌడ్ అందిస్తున్న సేవలను కొనియాడారు .