మోస్రా: విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ మోస్రా ప్రఖండ పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ప్రకటించినట్లు విభాగ్ కార్యదర్శి తమ్మలి క్రిష్ణ తెలిపారు.

విశ్వ హిందూ పరిషత్ ఖండ అధ్యక్షుడిగా వెల్మ గోపి రెడ్డి, కార్యదర్శిగా కొండ్రా సతీష్‌ను నియమించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే భజరంగ్ దళ్ సంయోజక్‌గా మాలోత్ తరుణ్‌ను ప్రకటించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు హిందూ సమాజ బలోపేతానికి, సేవా కార్యక్రమాల నిర్వహణకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో విహెచ్పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
