
రుద్రూర్, నవంబర్ 13: రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి-మహేష్ ఆదేశాల మేరకు జిల్లా వార్డు మెంబర్స్ ఫోరం జిల్లా ఇన్చార్జి కోర్జు సాయిలు, కో-ఇన్చార్జి సిరికొండ కళ్యాణి ఆధ్వర్యంలో శుక్రవారం రుద్రూర్ మండల వార్డు మెంబర్స్ ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల ఫోరం అధ్యక్షుడిగా గొర్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కుర్మే బాలయ్య, ఉపాధ్యక్షులుగా విజయ్ కృష్ణ, కోశాధికారిగా విజయ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . సలహాదారులుగా ఎం.డి. ఇమ్రాన్, అనిల్ ,కమిటీ సభ్యులుగా జాకీర్, బిట్ల రాములు, నీరడి శంకర్, అనిత, జె. సాయిలు, దత్తాత్రి లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్రను మరింత బలోపేతం చేస్తూ, ఫోరం లక్ష్యాల సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
