స్థానికం న్యూస్, రుద్రూర్
రుద్రూర్: మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్ష , ఉపాధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన నితిన్ పటేల్, అత్కురి మహేష్ ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పార్టీ పటిష్టత కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్ , మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పార్వతి ప్రవీణ్ , దువ్వ రవి,రాంబాబు, సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
