రుద్రూర్ (స్థానికం న్యూస్): డిమాండ్ల సాధనకు ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టిన ఆశా వర్కర్లను రుద్రూర్ పోలీసులు మంగళవారం తెల్ల వారు జామున ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా సిఐటీయు వర్ని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పి ఇంకా ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనాన్ని చెల్లించాలని, పీఎఫ్, ఈ ఎస్ ఐ, ప్రమాద భీమా, సాధారణ భీమా తదితర సౌకర్యాలను కల్పించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జి.భూలక్ష్మి, జి.పుష్ప, ఎం.నిర్మల, ఎం. లక్ష్మి, ఫర్జనా, కే. మహేశ్వరి తదితరులు ఉన్నారు.
