ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

కోటగిరి: మండల కేంద్రంలో మంగళవారం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంతో పాటు సంస్థ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచిరాం మాట్లాడుతూ…సామాజిక న్యాయం సాధన, ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఎమ్మార్పీఎస్ నిరంతరం ఉద్యమిస్తోందని అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బర్ల మధుకర్, ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, విండో చైర్మన్ సిద్ధూ, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.