
రుద్రూర్ : చేనేత సంఘ అభివృద్ధికి , కార్మికుల శ్రేయస్సుకు నిరంతరం కృషి చేయాలని మాజీ జడ్పిటిసి నారోజీ గంగారాం, సింగిల్ విండో మాజీ చైర్మన్ పత్తి రాము సూచించారు. బోధన్ చేనేత సహకార సంఘం ఎన్నికల్లో హొరాహోరి పోరులో విజేతలు నిలిచిన పాలకవర్గ సభ్యులను మంగళవారం వారు ఘనంగా సన్మానించారు. నూతన కమిటీ సభ్యులందరికీ మంచి పేరు ప్రతిష్టలు రావాలని వారు ఆకాంక్షించారు. సన్మానం అందుకున్న వారిలో సంఘం అధ్యక్షులు లోల శంకర్, ఉపాధ్యక్షులు మోత్కూరి నారాయణ, కార్యదర్శి శ్యాంసుందర్ పహాడే, డైరెక్టర్లు బేతి గంగారాం, మోత్కూరి సాయిలు, మోత్కూరి లక్ష్మణ్, తాటిపాముల విజయ్, మోత్కూరి కళావతి, జొర్రిగల లక్ష్మి ఉన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, రైతుబంధు అధ్యక్షుడు తోట సంగయ్య, అక్కపల్లి నాగేందర్, సంఘ మాజీ డైరెక్టర్లు శంకర్ , దత్తు , సంఘ సిబ్బంది ఈర్వ నాగరాజ్, అంకం నర్సింహులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు
