
రుద్రూర్: మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్ శనివారం గడపగడపకు వెళ్లి ఎస్‌ఐఆర్ పత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎస్‌ఐఆర్ పత్రాలను ప్రతి అర్హుడు తప్పనిసరిగా నింపి నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి స్వయంగా వివరాలు నమోదు చేసి సహకరించారు. ప్రజలు ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా అవసరమైన పత్రాలను జతచేసి ఎస్‌ఐఆర్ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిసార్, ఆమంద్ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాల్గొన్నారు.
