రుద్రూర్: మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో
శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ మచ్కూరి రమేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిపి పాలకవర్గ సభ్యులు, సిబ్బంది , గ్రామస్తులు జాతీయ పతాకానికి వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉప సర్పంచ్ ,వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

