
రుద్రూర్: మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో శ్రీ ఆంజనేయ గోశాలను బుధవారం ప్రారంభించారు. అఖిల భారతీయ కళావిభాగ్ కన్వీనర్ అప్పల ప్రసాద్జీ ముఖ్యఅతిథిగా హాజరై గోశాలను ప్రారంభించి మాట్లాడారు. గోసంరక్షణకు గోశాలలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. గోవులను సంరక్షించడం ద్వారా వాటి ప్రాణాలను కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని తెలిపారు. గోశాల అభివృద్ధికి గ్రామ ప్రజలు, దాతలు సహకరించాలని కోరారు.
గ్రామ ప్రజల సహకారంతో గోశాల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కుర్లేపు గంగాధర్, గోశాల కమిటీ ఉపాధ్యక్షుడు, ఉపసర్పంచ్ రేపల్లె సాయి ప్రసాద్, కోశాధికారి ఆసం రాము, పండరి, రాములు, గంగాధర్ సాయిలు, వ్యాపారవేత్త బచ్చు రామ్ సెట్, గోశాల కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


