ఘనంగా బతుకమ్మ పండుగ

రుద్రూర్‌: మండలంలోని అంబం ( ఆర్ ),  రాయకూర్ గ్రామాల్లో గురువారం బతుకమ్మ పండుగనుభక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను మధ్యలో ఉంచి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా స్థానిక చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.