
రుద్రూర్ :నిజామాబాద్ జిల్లా గౌడ ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక సహకార ఆర్థిక సంక్షేమ సంస్థ ఛైర్మన్ మోత్కూరి శేఖర్ గౌడ్ జన్మదిన వేడుకలను శుక్రవారం రుద్రూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శేఖర్ గౌడ్ ఆయురారోగ్యాలతో, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రుద్రూర్ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్, బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ నిసార్ ఖదీర్, గౌడ సంఘం అధ్యక్షుడు గోవిందు గౌడ్, జయశంకర్ గౌడ్, బాలరాజు గౌడ్, గంగాధర్ గౌడ్, బొంబాయి రాజగౌడ్, శ్రీకాంత్ గౌడ్, రమణ గౌడ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
