
కోటగిరి : కోటగిరి పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ శ్రీనివాస్‌ను కోటగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు ఎస్ఐ శ్రీనివాస్‌కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంగాధర్ దేశాయ్, డిసిసి కార్యదర్శి కొట్టం మనోహర్, నాయకులు నర్సయ్య సేట్, ఆనంద్, కప్ప గణేష్, అబ్జల్, గంగాధర్ ఎం.పీ.టీ.సీ, మోతిపేట్ రాజయ్య, సాయిలు, మస్తాన్, సోహైల్ తదితరులు పాల్గొన్నారు.
