బైరాపూర్ ఉపాధ్యాయుడి దాతృత్వం

రూ. పది వేలు అందిస్తున్న రాథోడ్ రవి

బీర్కూర్:  కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే ఆ తండ్రులకు   తలకు మించిన భారమే.. దాన్ని అర్థం చేసుకున్న భైరాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రాథోడ్ రవి తనవంతు చేయుత ను అందిస్తున్నాడు. బొప్పాస్ పల్లి లో  బుధవారం జరిగిన కర్ర సర్దార్ కుమార్తె సోని బాయి వివాహానికి రూ. పది వేలు అందించి దాతృత్వం చాటుకున్నాడు. ఉపాధ్యాయుడు రవి దాతత్వం పట్ల స్థానికులు, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.